ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని దేవనగర్ క్రాస్ రోడ్ వద్ద సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును తప్పించబోయి ద్విచక్ర వాహనంపై పై ప్రయాణిస్తున్న దంపతులు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందారు. మృతులు ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన మొహమ్మద్ మహిముద్దీన్, భార్య మహమ్మద్ షాహినా గా స్ధానికులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.