గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల కస్టడీ ఇవాల్టితో ముగిసింది. విచారణ సందర్బంగా సత్యవర్థన్ కిడ్నాప్ వెనక ఎవరు ఉన్నారని ఆరా తీశారు. వంశీ ఫోన్ గురించి కూడా మరోసారి ప్రశ్నించారు ఏసీపీ. జిల్లా కోర్డులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు. కాగా వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలోని పలు పీఎస్‌లలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కావడం గమనార్హం.