పోలింగ్ బందోబస్తుని పర్యవేక్షించిన అభిషేక్ మహంతి
NEWS Feb 27,2025 02:12 pm
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని గురువారం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి తెలిపారు. నగరంలోని పోలింగ్ బూత్ లను సందర్శించారు. నగరంలోని విద్యానగర్ సెంట్ జాన్స్ స్కూల్, రేకుర్తిలోని లయోలా స్కూల్ ల వద్దా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద కేటాయించిన బందోబస్తును పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.