ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో ఉన్న తనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకు వెళ్లారు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు. గత నాలుగు నెలల నుంచి మీడియా ముందుకు రాలేదు. దీంతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.