నిద్ర పోయిన సీఎం ఆప్ ఆగ్రహం
NEWS Feb 27,2025 08:33 am
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేఖా గుప్తా నిద్ర పోవడం పట్ల ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే, ప్రధాన అంశాలపై చర్చ జరుగుతుంటే బాధ్యత కలిగిన సీఎం నిద్ర పోవడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. రేఖా గుప్తపై లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చర్యలు తీసుకోవాలని, సభా సమయాన్ని వృధా చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆప్ డిమాండ్ చేసింది.