కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలోని ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన అందరూ సుఖశాంతులతో ఉండాలని మంచి సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో రైతులు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.