నిర్మల్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు స్వాధీనం
NEWS Feb 26,2025 05:51 pm
నిర్మల్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీసులను స్వాధీనం చేసుకుంది కోర్టు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించక పోవడంతో ఆఫీసులను స్వాధీనం చేసుకుంది. 1999 లో గడ్డెన్న, శ్రీరాంసాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు కలెక్టరేట్ నుండి రూ. 6,79,63,102 కోట్లు, ఆర్డీఓ నుండి రూ. 1,45,46,927 కోట్ల పరిహారం రావాల్సి ఉండగా జాప్యం జరిగింది. దీనిపై బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు అందజేశారు.