ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయంలో మహా శివరాత్రి సందర్భం భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలోని శివలింగానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.