మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించారు. రూ. 10 కోట్లతో వైఎస్ రాజా రెడ్డి నేత్ర వైద్య శాల ఆధునీకరణ చేపట్టారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ నేత్రాలయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆప్పత్రిని పరిశీలించారు. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. తను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. గత దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోందని అన్నారు జగన్.