తమిళనాట రాజకీయాలలో పెను సంచలనంగా మారారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. మహాబలిపురం వేదికగా జరిగిన దళపతి విజయ్ టీవీకే తొలి వార్షికోవత్సవం సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. కీలక అంశాలపై చర్చించారు. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీకి పని చేశారు పీకే. ఇప్పుడు నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తో జత కట్టడం చర్చనీయాంశంగా మారింది.