శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.29 కోట్లు
NEWS Feb 26,2025 10:54 am
తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 127 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 307 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.29 కోట్లు వచ్చిందని ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.