మున్సిపల్ ఉద్యోగికి ప్రిన్సిపాల్ సన్మానం
NEWS Feb 26,2025 09:18 am
మెట్ పల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ముజీబ్ ను ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు కలిసి సన్మానించారు. ఫోను చేయగానే పారిశుద్ధ్య సిబ్బందితో కళాశాల ఆవరణను పరిశుభ్రంగా చేయించిన సందర్భంగా శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.