ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య ఏపీ మార్ టైం బోర్డు సీవోగా పని చేస్తున్నారు. తాజాగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే చైర్మన్ గా ను ఉన్న జీవీ రెడ్డి నిన్న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ పని చేసిన ఎండీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో తాను టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.