ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.2,684 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షలమందికి గ్యాస్ సిలిండర్లు అందించామని వెల్లడించారు.