డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
NEWS Feb 25,2025 05:51 pm
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు ములుగు మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ జాకారంలో జరుగుతున్న, జాతీయ నాణ్యత ప్రమాణాల వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమాన్ని సందర్శించినారు. జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ పొందడం వలన, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తో పాటు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం యొక్క సదుపాయాల,మౌలిక వసతులు, మెరుగవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విపిన్ కుమార్,డాక్టర్ పవన్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.