మెట్ పల్లి పట్టణంలోని 12 వార్డ్ లో ఒడ్డే కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వడి నర్సింగరావు అన్నారు. పలు సమస్యలను మంగళవారం ఆయనకు విన్నవించారు. సమస్యలు విన్న ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.