గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఇప్పటికే తనను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా మరో కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై ఫిర్యాదు చేశారు.