ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వి. హనుమంత రావు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వీరిద్దరూ గత కొంత కాలం నుంచీ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇరువురు నేతలు సమకాలీన రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు. ఇరువురు వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ కలుసు కోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వేరైనా తాము ఇద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు.