ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రిజైన్
NEWS Feb 24,2025 07:37 pm
ఏపీ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జీవీ రెడ్డి. తన రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబుకు పంపించారు. తను లాయర్ గా కొనసాగుతానని, ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనను ఏరికోరి ఎంపిక చేశారు సీఎం. ఇదే సమయంలో ఫైబర్ నెట్ లో ఎండీగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పై బహిరంగంగానే ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి. దీనిపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. బహిరంగంగా విమర్శలు చేస్తే పాలనా పరంగా ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు.