సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తానే కుల గణన చేపట్టానని అన్నారు. 1931 నుంచి ఎవరూ బీసీ కుల సర్వే చేపట్టలేదని ఆరోపించారు. తాను బీసీ నంటూ పీఎం మోదీ పదే పదే చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. బీసీల కోసం పాటుపడిన తనను కేసీఆర్, మోదీ ఓడించాలని చూస్తున్నారంటూ సంచలనా రోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు.