ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు
NEWS Feb 24,2025 06:04 pm
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఐపిఎస్ ఎదుట మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ @గంగక్క లొంగిపోయారు. తుపాకులగూడెం గ్రామానికి చెందిన పద్మ పీపుల్స్ వార్ గెరిల్లా మావోయిస్టు పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితురాలై, ప్రేరణ పొంది 1998 లో దళంలో చేరింది. మావోయిస్టు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అనారోగ్య పరిస్థితుల ద్రుష్ట్యా పోలీసులకు లొంగిపోయారని తెలిపారు.