జగిత్యాల లో యూరియా కొరత వల్ల రైతులు గంటల పాటు క్యూ లో నిలబడలేక పట్టా పాస్ బుక్కులు పెట్టి నిలిచి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా పరిమితంగా ఉండటంతో ముందస్తుగా వచ్చే వారి సంఖ్య అధికమైంది.అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతులు వాపోతున్నారు. త్వరలోనే సరఫరా సాధారణ స్థాయికి వస్తుందని అధికారులు చెబుతున్నా, ఇప్పటిదాకా మార్పు కనిపించలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.