జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. పట్టణంలోని పద్మా నగర్ కు చెందిన గుండేటి రాజశేఖర్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళగా సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంట్లో దుండగులు చొరబడి 15 తులాల బంగారం, రూ.15 వేల నగదు దోచుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.