MBNR: రాజాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో వరి సాగు చేసిన రైతులు సహాయంతో మందులను పిచికారి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరికి అగ్గి తెగులు సోకడంతో వరి పంట ఎర్రబడుతుంది. దీంతో రైతులు ఇతర ప్రాంతాల నుంచి డ్రోన్లను తీసుకువచ్చి మందులను పిచికారి చేశారు. డ్రోన్లతో పిచికారి చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ పని పూర్తవుతుందన్నారు.