ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 11 నిమిషాల పాటు శాసన సభలో ఉన్నారు జగన్. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి వెళ్లి పోయారు. కూటమి సర్కార్ కావాలని కక్ష కడుతోందంటూ మండిపడ్డారు.