ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగి పోయాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగుల టార్గెట్ ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విక్టరీ కావడం విశేషం.