MBNR: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో టాయిలెట్ పనిచేయడం లేదు. వార్డులో నడవలేని స్థితిలో ఉన్న పేషెంట్లు టాయిలెట్కి వెళ్లాలనుకుంటే సిబ్బంది దూరంగా ఉన్న టాయిలెట్ కి వెళ్ళమంటున్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉంటే అంత దూరం టాయిలెట్కి ఎలా వెళ్లాలంటూ పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.