మెట్ పల్లి: పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆదివారం మెట్ పల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రఘు నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. తేనీటి విందును స్వీకరించారు. ఆయనను నరేందర్ రెడ్డి, తదితరులు కలిశారు.