అంతర్జాతీయ స్కేటింగ్ లో బంగారు పతకం సాధించి విజేతగా నిలిచిన జెస్సీ రాజ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. తన క్యాంపు కార్యాలయంలో తనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారి పేరెంట్స్ ను ప్రశంసించారు. తనను ప్రోత్సహించినందుకు ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం తరపున కూడా అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు.