గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
NEWS Feb 23,2025 10:56 am
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్ లు, మొబైల్ ఫోన్లు తీసుకు రాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, నెట్ సెంటర్లను ముందస్తుగానే మూసి వేశారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ప్రకటించింది ఏపీపీఎస్సీ. 15 నిమిషాల కంటే ముందు వచ్చిన అభ్యర్థులను మాత్రమే లోపలికి పంపించారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించలేదు.