యూపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభ మేళాలో ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని వెల్లడించింది. దేశంలోని 110 కోట్ల మంది సనాతన అనుచరులలో సగానికి పైగా స్నానం చేయడం విశేషమని పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపింది. కొన్ని ఘటనలు మినహా కుంభ మేళా మహోత్సవం నిరాటంకంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.