ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ లో ఆదివారం కీలకమైన పోరుకు సిద్దమయ్యాయి దాయాదులైన పాకిస్తాన్, ఇండియా జట్లు. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. మ్యాచ్ కు సంబంధించి టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయి. మ్యాచ్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ ను కోట్లాది మంది వీక్షిస్తారని అంచనా.