ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగు గంటల పాటు ప్రయత్నం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. 12 కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. మోకాలు లోతు వరకు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేక పోయింది. మొత్తం ఆరు మీటర్ల మీద బురదతో నిండి పోయిందని పేర్కొంది. ఫ్లై కెమెరాతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ఆపరేషన్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది బృందం .