మిర్చి రైతులను అదుకుంటాం
NEWS Feb 23,2025 09:01 am
ధర రాక ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎగుమతి దారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మిరప రైతులను ఆదుకోవాలన్నదే తన తాపత్రయం అని అన్నారు. రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాశానన్నారు. మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నుంచి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.