తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Feb 23,2025 08:15 am
తిరుమల క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 78 వేల 110 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 20 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు స్వామి, అమ్మ వార్ల దర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.