కార్మికుల ఆచూకీ కోసం వెతుకుతున్నాం
NEWS Feb 22,2025 05:03 pm
ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కనిపించకుండా పోయిన ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ కోసం వెతుకుతున్నామని చెప్పారు. పనులు ప్రారంభం అవగానే ఒక సైడ్ నుండి నీళ్ళు టన్నెల్ లోకి ప్రవేశించడం మొదలైందన్నారు. చీకటి గా ఉండటంతో లోపల చిక్కుకు పోయిన వారి వెదుకులాట ఇబ్బందిగా మారిందన్నారు. ఘటనకు కొన్ని క్షణాలకు ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని అన్నారు. నిపుణులతో మాట్లాడుతున్నామని ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు.