ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షులుగా పైడి కొండల
NEWS Feb 22,2025 04:37 pm
కాపుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు ఉంగుటూరు నియోజకవర్గ కాపు అధ్యక్షుడిగా నియమితులైన పైడికొండల సురేష్. ఏపీ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర్ రావు ద్వారా నియామక పత్రం అందుకున్నారు. తనను నియమించేందుకు సహాయ సహకారాలు అందించిన నియోజకవర్గ నాయకులకు, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీకి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు పైడికొండల.