బీసీ రిజర్వేషన్లపై సీఎం సమీక్ష
NEWS Feb 22,2025 12:48 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికపై సమీక్ష చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా బీసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు.