దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫాల్కన్ స్కాం. దీనిపై విచారణ చేపట్టంది ఈడీ. హైదరాబాద్ కేంద్రంగా ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశమంతటా రూ. 1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ. 850 కోట్లకు పైగా వసూలు చేసింది ఫాల్కన్. ఈ వసూళ్లు చేసిన డబ్బులను విదేశాలకు మళ్లించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసింది. పెట్టుబడి పెడితే చాలు భారీగా వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించింది పాల్కన్ సంస్థ.