మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాయుత కూటమి అధికారంలో ఉంది. అనూహ్యంగా తాను సీఎం పదవిని ఆశించారు. కానీ ఊహించని రీతిలో అమిత్ షా చక్రం తిప్పారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. పైకి ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా షిండే, ఫడ్నవీస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా తనను లైట్ గా తీసుకుంటే ఊరుకుంటానా నేనిమిటో చూపిస్తానంటూ హెచ్చరించారు.