మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన నితీశ్ కుమార్ అనే యువకుడిని మోసం చేసి రూ.6 లక్షలు కాజేసిన కృష్ణయాదవ్ ను అరెస్టు చేసినట్లు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉన్నత చదువులకై లండన్లో సీట్ కోసం ప్రయత్నిస్తున్న నితీశ్కు లండన్లో ఉంటున్న తిరుపతికి చెందిన కృష్ణ యాదవ్ ఓ యాప్ ద్వారా పరిచయమై మాయమాటలు చెప్పి 2023లో డబ్బులు కాజేసి మోసం చేశాడు.2 0 తేదీన కృష్ణ యాదవ్ లండన్ నుండి హైదరాబాద్ కు రావడంతో.నిందితుడిని ఎయిర్పోర్టులో పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.