అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పస్రా ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో ఎస్సై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా లారీ కనిపించింది. అదుపులోకి తీసుకొని చూడగా పిడిఎస్ బియ్యం ఉండడంతో లారీలో అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యం విలువ ఆరు లక్షల 47 వేల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.