సీఎం రేవతంరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాము పోటీ చేయబోమన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్న పల్లెల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలన్నారు. కేసీఆర్ కు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పాలమూరు పాలిట తను శాపంగా మారాడని ఆరోపించారు. వైఎస్ఆర్, జగన్ కు ఊడిగం చేసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించారని మండిపడ్డారు. తెలంగాణ జలాలను అక్రమంగా కట్టబెట్టిన ఘనత నీది కాదా అంటూ నిప్పులు చెరిగారు.