తమ ప్రభుత్వం మహిళల అభివృద్దికి పెద్దపీట వేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో ఇళ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళలే నడిపిస్తుండడం విశేషం. దేశంలోనే తొలిసారిగా పెట్రోల్ బంకును స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం. మహిళలు ఆత్మ గౌరవంతో బతికేందుకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.