సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు భరోసా
NEWS Feb 21,2025 02:47 pm
ఏపీ మంత్రి అనితతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీసిందని, బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో రూ. 200 కోట్ల విలువైన చిట్స్ కట్టించుకొని బోర్డు తిప్పేశారంటూ వెల్లడించారు. బాధితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. భారీ ఎత్తున మోస పోయారని, వారికి న్యాయం చేయాలన్నారు. నిందితుడు పాలడుగు పుల్లారావును ఇప్పటికే అరెస్ట్ చేశామని వెల్లడించారు వంగలపూడి అనిత. బాధితులకు న్యాయం చేస్తామన్నారు.