మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటా హుటిన శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా మెగాస్టార్ ఫ్యామిలీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. తన తల్లికి అనారోగ్యంకు గురి కావడంతో విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన విజయవాడ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఇటీవలే అంజనాదేవి పుట్టినరోజు జరుపుకున్నారు.