అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ గా ప్రవాస భారతీయుడైన కాశ్ పటేల్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో కేవలం 2 ఓట్ల తేడాతో కాశ్ గట్టెక్కడం విశేషం. ఆయనకు మద్దతుగా 51 ఓట్లు రాగా 49 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఇదిలా ఉండగా కాశ్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు.