వనపర్తి జిల్లాలో కోళ్ల అమ్మకాలపై నిషేధం
NEWS Feb 21,2025 11:43 am
వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. జిల్లాలోని మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్ అమ్మకాలను వెంటనే నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పశు సంవర్దక శాఖ అధికారులు, వైద్యులు హుటా హుటిన కోళ్ల ఫారాలను, అమ్ముతున్న దుకాణాలను పరిశీలించారు. వెంటనే అమ్మకాలు నిలిపి వేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.