సీఎం రేవంత్ పై గుమ్మడి గుస్సా
NEWS Feb 21,2025 08:53 am
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశానని, కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వడం లేదంటూ వాపోయారు. తన వద్ద పనిచేస్తున్న పీఎస్ జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని, అసలు ఈ సీఎం ఎవరి కోసం ఉన్నారంటూ ప్రశ్నించారు. ఎన్ని సార్లు వచ్చినా గేటు వద్దే నిలిపి వేస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ కు వెళ్లినా, ఇంటికి వెళ్లినా రానివ్వడం లేదన్నారు.