కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈనెల 21న సాయంత్రం 3.30 గంటలకు కృష్ణా రివర్ బోర్డు సమావేశం కానుంది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేటాయించాలని కోరారు మంత్రి. దీనిపై తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు.